ప్రకాశం: కొండపి సర్కిల్ పోలీస్ స్టేషన్లో సీఐ సోమశేఖర్, ఎస్సై ప్రేమ్ కుమార్ బుధవారం మహిళా పోలీసులతో సమావేశమయ్యారు. మహిళా సమస్యలపై సలహాలు, సూచనలు అందిస్తూ, శక్తి యాప్ డౌన్లోడ్ గురించి చర్చించారు. మహిళలపై జరిగే నేరాల గురించి గ్రామాల్లో, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మహిళా పోలీసులకు సీఐ ఆదేశించారు.