PLD: వినుకొండ కాంగ్రెస్ నేత, పీసీసీ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున బీజేపీలో చేరారు. బుధవారం విజయవాడలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మోదీ సంక్షేమ పథకాలు, హిందుత్వం నచ్చే తాను బీజేపీలో చేరానని నాగార్జున తెలిపారు. ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు.