BDK: భద్రాద్రి కొత్తగూడెం డీసీసీ అధ్యక్షురాలిగా నియమితులైన కొత్తగూడెం పట్టణానికి చెందిన తోట దేవి ప్రసన్న, బుధవారం హైదరాబాద్లోని గాంధీ భవన్లో నియామక పత్రాన్ని స్వీకరించారు. రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో, ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ చేతుల మీదుగా ఆమె పత్రాన్ని అందుకున్నారు.