ATP: కళ్యాణదుర్గం పట్టణంలోని దొడగట్ట రోడ్డులో రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని మంత్రాలయం మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో గురువారం ఘనంగా ప్రతిష్ఠించారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో దేవాలయ నిర్మాణ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. స్వామి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్నదానం కూడా చేశారు.