E.G: ఈ విద్యా సంవత్సరానికి ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేసేందుకు ఇన్స్ట్రక్టర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో వాసుదేవరావు తెలిపారు. అనపర్తి, రాజమండ్రి, సహా పది మండలాల్లో 25 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీలోగా డీఈవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఆయన సూచించారు.