Karthi’s comments on not being a nepo kid turn negative
Karthi: తమిళ నటుడు కార్తీ (Karthi) హీరోగా నటించిన తాజా చిత్రం జపాన్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మూవీ కోసం కార్తీ చాలా కష్టపడ్డాడు. అన్ని భాషల్లో విడుదల చేస్తున్నందున, అన్ని చోట్లా ఒక్కటే ప్రమోషన్స్ చేసుకున్నాడు. ఆ సమయంలో జపాన్‌లో పాత్ర గురించి, సినిమాల్లో తన ప్రయాణం గురించి మాట్లాడారు.
ఆ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. జపాన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో కార్తీ తన కోసం వాడుతున్న నేపో కిడ్ అనే పదంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. నేపో కిడ్ అంటే తన తండ్రి ఎంతో డబ్బు, పేరు ప్రఖ్యాతులు, కొడుకు కోసం ఎదురుచూసే ఎమ్‌డి కుర్చీని సంపాదించేవాడు.. తాను నేపో కిడ్ కాదని కార్తీ అన్నారు.
“మీ నాన్నగారికి చాలా పేరు, డబ్బు ఉంది కాబట్టి.. మీకు ఇది సులభం అవుతుందని.. చిన్నప్పటి నుంచి అందరూ తనతో అదే చెప్పారు. మా నాన్న మమ్మల్ని ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ ప్రోత్సహించలేదు. తనకు క్రియేటివ్ జాబ్స్ అంటే ఇష్టం అని.. డైరెక్షన్ ఫీల్డ్‌లో ఉండాలని అకున్నానని వివరించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా సహాయం చేశారని తెలిపారు. సినిమా విడుదల కోసం తొలుత తాను, సూర్య చాలా కష్టపడ్డామని, అందుకే తాము నేపో కిడ్స్ కాదని కార్తీ తెలిపారు.
కార్తీ కామెంట్స్ పై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సినిమాల్లోకి రావడానికి వాళ్ల అన్న సహాయం చేశాడు కదా.. అది నెపొటిజం కాదా అని విమర్శిస్తున్నారు. దీనిపై కార్తీ ఏమంటారో చూడాలి.