»A Strange Law In Japan You Have To Laugh Every Day
Laugh every day: జపాన్లో వింత చట్టం.. రోజుకొక్కసారి నవ్వాలి
జీవితంలో నవ్వు ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు, అయినా సరే చాలా మంది నవ్వడానికి కష్ట పడుతుంటారు. అందుకని కచ్చితంగా నవ్వాలి అనే చట్టానికి తీసుకొచ్చింది జపాన్.. దాని చరిత్ర ఏంటో తెలుసుకుందాం.
A strange law in Japan.. You have to laugh every day
Laugh every day: అన్ని దేశాలు చట్టాలు ఎందుకు చేస్తారో అందరికీ తెలుసు. నేరాలను అరికట్టాడానికి, ప్రజల సంక్షేమానికి నియమాలు రూపొందిస్తాయి. కానీ జపాన్లో మాత్రం ఒక వింత చట్టం తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ చట్టం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. యమగట ప్రిఫెక్చర్ స్థానిక ప్రభుత్వం ప్రతిరోజూ అందరూ నవ్వాలనే కొత్త చట్టం ప్రవేశపెట్టింది. మానవుల్లో శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన ఆదేశాలను శుక్రవారం విడుదల చేసింది. నవ్వే వాతావరణాన్ని ప్రోత్సహించాలని కంపెనీలను ఆదేశించింది. దీనికోసం ప్రతినెల 8 వ తేదీన హస్యంతో ఆరోగ్యం కోసం కెటాయించాలని తెలిపింది.
యమగట విశ్వవిద్యాలయంలోని ‘ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్’ ఓ ప్రయోగం చేసింది. దాని ఫలితమే ఈ తాజా చట్టం. ఆరోగ్యకరమైన జీవితాన్ని పెంపొందించుకోవాలంటే నవ్వు ఎంత ముఖ్యమో ఈ ఆధ్యయనం చెబుతుంది. అనేక మంది నిపుణులు వేలా మందిపూ ప్రయోగాలు చేసి తాజా చట్టాన్ని రూపోందించారు. రోజు నవ్వేవారికి కొన్ని రకాల రకాల వ్యాధులు, మరణం ముప్పు తగ్గుతుందని గుర్తించారు. అందుకే అక్కడి ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దీన్ని రాజకీయ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక వ్యక్తి నవ్వకపోడానికి చాలా కారణాలు ఉంటాయి అని, ఇలాంటి చట్టాలు వారిపై ప్రతీకూలంగా ఉంటాయని పేర్కొన్నారు. అంతేకాకుండా నవ్వడం, నవ్వకపోవడమనేది భావప్రకటనా స్వేచ్ఛ అని జపాన్ కమ్యూనిస్ట్ పార్టీ తెలిపింది. ఇలాంటి విమర్శలను అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ తోసిపుచ్చింది. ప్రజలను ఇందులో ఇబ్బంది పెట్టేది ఏం లేదని, వారిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు అని పేర్కొంది.