»Ananya Panday Liger Heroine With Boyfriend Private Photos Leaked
Ananya Panday: బాయ్ ఫ్రెండ్‌తో ‘లైగర్’ హీరోయిన్.. ప్రైవేట్ ఫొటోలు లీక్!
విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో హీరోయిన్గా నటించిన అనన్య పాండే, తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న కొన్ని ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి అనన్య ఏమంటోంది?
Ananya Panday: లైగర్ సినిమాతో టాలీవుడ్‌తో పాన్ ఇండియా ఎంట్రీ ఇచ్చిన అనన్య పాండేకు నిరాశే మిగిలింది. లైగర్ హిట్ అయి ఉంటే అమ్మడికి తెలుగులోను ఆఫర్లు వచ్చి ఉండేవి. కానీ లైగర్ ఫ్లాప్ అవడంతో ప్రస్తుతం బాలీవుడ్లోనే సినిమాలు చేస్తోంది. బాలీవుడ్ యాక్టర్ చుంకీ పాండే కూతురుగా 2019 లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిందన అనన్య పాండే.. ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. అమ్మడు ఓ హీరోతో ప్రేమలో ఉందనే మాట వినిస్తునే ఉంది. ఈ క్రమంలో అనన్య పాండేకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫొటోలు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్‌గా మారాయి.
బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్తతో అనన్య పాండే కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు ప్రచారంలో ఉంది. ఎక్కడికెళ్లిన ఇద్దరు కలిసే వెళ్తుంటారని బీ టౌన్ టాక్. కానీ ఇద్దరు మాత్రం లవ్ విషయంలో ఎప్పుడు ఓపెన్ అవలేదు. అయితే.. లేటెస్ట్గా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఈ ఫొటోల్లో ఆదిత్య రాయ్‌తో అనన్య పాండే చాలా క్లోజ్‌గా ఉండటం కనిపించింది. దీంతో ఈ ఇద్దరు రిలేషన్లో ఉన్నది నిజమేనంటూ.. వార్తలు ఊపందుకున్నాయి.
అనన్య చెప్పకపోయినా ఈ ఫోటోలే తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టేసిందని అంటున్నారు. దీంతో ఈ ఫోటోలపై అనన్య పాండే రియాక్ట్ అయింది. మేము ప్రైవేట్‌గా ఉన్న చిత్రాలను కూడా పబ్లిక్‌గా పెడుతున్నారంటూ.. ఆవేదన వ్యక్తం చేసింది. అమ్మడు కోప్పడితే పడింది కానీ.. ఇద్దరు దొరికేశారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.