ADB: వినియోగదారులకు నాణ్యమైన ఇంధనాన్ని అందించాలని ఉట్నూర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ కేంద్రంలో ఏర్పాటు చేసిన జీసీసీ పెట్రోల్ బంక్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేయడం జరిగిందని, వాహనదారులు బంకును వినియోగించుకోవాలన్నారు.