NLR: జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలలకు శనివారం నుంచి ఈ నెల 18 వరకు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు డీఈఓ డా. ఆర్ బాలాజీ రావు ఒక ప్రకటనలో తెలిపారు. సెలవుల్లో తరగతులను నిర్వహిస్తే ప్రభుత్వ నిబంధనల మేరకు సదరు పాఠశాలలపై చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అన్ని యాజమాన్య పాఠశాల కళాశాల సిబ్బంది సహకరించాలని కోరారు.