MDK: సింగూరు ప్రాజెక్టు ఆనకట్టను మరింత దృఢంగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఈ సీజన్లోనే మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పనుల కోసం ప్రాజెక్టు నీటి మట్టాన్ని 520 మీటర్ల నుంచి 517 మీటర్లకు తగ్గించాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.