KNR: సైదాపూర్ మండలం ఆరెపల్లిలో శుక్రవారం సర్పంచ్ వర్నె లావణ్య అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. గ్రామంలో మంచినీరు, డ్రైనేజీ, పారిశుధ్య నిర్వహణపై చర్చించారు. ప్రధానంగా ఆరెపల్లి-వెన్నంపల్లి గైచెరువు వరకు సీసీ రోడ్డు, అక్కడి నుంచి జాగీర్పల్లి వరకు బీటీ రోడ్డు నిర్మించాలని ప్రతిపాదించారు. మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.