సత్యసాయి: సంక్రాంతి పండగ పురస్కరించుకుని ధర్మవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11న జిల్లాస్థాయి సంప్రదాయ క్రీడలు నిర్వహించనున్నారు. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి అశోక్ ఈ వివరాలు వెల్లడించారు. మహిళలకు తాడులాగుడు, కర్రసాము పోటీలు ఉంటాయి. పురుషులకు గాలిపటాల పోటీలు, కర్రసాము నిర్వహించనున్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 9848187636 నంబర్‌ను సంప్రదించాలన్నారు.