AP: విశాఖ ఎయిర్‌పోర్ట్‌ను యథావిధిగా కొనసాగించాలని BJP MLA విష్ణుకుమార్‌రాజు డిమాండ్ చేశారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే లోపు వందేభారత్‌లో విజయవాడ వెళ్లొచ్చని.. విశాఖ నుంచి భోగాపురానికి రెండున్నర గంటలు పడుతుందన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు బదులు 2 వందేభారత్ రైళ్లు వేయాలని కోరారు. ఎయిర్‌పోర్టుపై ప్రజాభిప్రాయం తీసుకోవాలన్నారు.