TG: జాబ్ క్యాలెండర్‌పై బీఆర్ఎస్ మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తొమ్మిదేళ్లలో BRS ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదన్నారు. ప్రణాళిక ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. గ్రూప్-1,2,3,4 ద్వారా ఇప్పటికే 70 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్ ఇస్తాం.. ఆందోళన చెందవద్దన్నారు.