ASF: రెబ్బెన మండలం గంగాపూర్ కేజీబీవీ పాఠశాలను శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న ఆహార నాణ్యతను పరిశీలించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం భోజనం అమలవుతున్నదీ లేదో అడిగి నిర్ధారించారు. ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.