AP: గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధికి రూ.14 కోట్లు మంజూరు అయ్యాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్టేడియం అభివృద్ధికి దశల వారీగా నిధులు సేకరిస్తామని చెప్పారు. కేంద్రానికి తెలిపిన క్రీడా మౌలిక వసతుల ప్రతిపాదనలో భాగంగా ఖేలో ఇండియా స్కీమ్ కింద రూ.14 కోట్ల మంజూరుకు క్రీడల శాఖ ఆమోదం తెలిపిందని వెల్లడించారు.