»Priyanka Chopra Nick Jonas Who Vacated The Rs 165 Crore House What Is The Reason
Priyanka Chopra: రూ.165 కోట్ల భవంతిని ఖాళీ చేసిన ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్.. కారణం ఏంటంటే?
అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్, హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇళ్లు మారారు. లాస్ ఏంజెలిస్ నగరంలో ఉంటున్న వారి విలాసవంతమైన భవంతిని ఖాళీ చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతుంది.
Priyanka Chopra, Nick Jonas, who vacated the Rs.165 crore house, what is the reason?
Priyanka Chopra: అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్(Nick Jonas), బాలీవుడ్, హలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) దంపతులు ప్రస్తుతం తమ నివాసాన్ని అమెరికాకు మార్చివేశారు. హాలీవుడ్ స్టార్స్ ఉండే లాస్ ఏంజెలిస్ నగరంలో సుమారు రూ.165 కోట్లతో అత్యంత విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు. వీరి పెళ్లి అయినప్పటి నుంచి అందులో ఉంటున్నారు. తాజాగా దాన్ని ఖాళీ చేసి అమెరికాకు వెళ్లడంతో నెట్టింట్ల ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
7 బెడ్రూంలు, 9 వాష్ రూంలు, చెఫ్ కిచెన్, స్పా, స్టీమ్ షవర్, మినీ థియేటర్, బిలియర్డ్స్ రూమ్, వైన్ సెల్లార్ టెంపరేచర్ అండ్ హ్యుమిడిటీ కంట్రోల్ యూనిట్ సదుపాయంతో లగ్జరియస్గా ఉన్న ఈ ఇంటిలో నీళ్లు లీకౌతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. వాటర్ లీక్ అవడంతో ఇప్పటికే ఇంట్లో చాలా భాగాలు పాడైపోయాయట, ఇలాంటి ఇళ్లుు అమ్మిన వారిపై వారు కోర్టులో కేసు కూడా వేశారు. ఇప్పుడు ఆ ఇంటిని మరమత్తు చేయించాలంటే దాదాపు రూ. 20 కోట్లు ఖర్చు అవుతుందని, అందుకే దాన్ని వీడినట్లు అంతర్జాతీయ కథనాలు వస్తున్నాయి.