»Is Priyanka Chopras Necklace Worth All The Crores
Priyanka Chopra: వామ్మో.. ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ధర అన్ని కోట్లా?
నటి ప్రియాంక చోప్రా ప్రపంచంలోనే ఖరీధైన అభరణాల తయారు చేసే బల్గారీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బల్గారీ 140వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రియాంక మెరిసింది. ఆ ఈ వెంట్లో ఓ నెక్లెస్ ధరించి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ నెక్లెస్ కాస్ట్ ఎంత అని నెటిజనులు తెగ వెతుకుతున్నారు. దాని విలువ తెలుసుకొని నోరెళ్లబెడుతున్నారు.
Is Priyanka Chopra's necklace worth all the crores?
Priyanka Chopra: అందాల నటి ప్రియాంక చోప్రా ఇప్పుడు హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా తాను ఓ అభరణాల తయారి కంపెనీ వేడుకలో పాల్గోని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే తాను ధరించిన నెక్లెస్‌పై ఇప్పుడు తీవ్ర చర్చ సాగుతుంది. ప్రముఖ అంతర్జాతీయ ఆభరణాల బ్రాండ్ బల్గారీకి ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది. ఈ సందర్భంగా ఈ సంస్థ 140 వ వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించింది. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా హాట్ బ్యూటీ ప్రియాంక నిలిచింది. అంతే కాదు తాను ధరించిన ఓ డైమండ్ నెక్లెస్‌పై అందరి కళ్లు పడ్డాయి. ప్రస్తుతం ఆ ఆభరణం గురించి చర్చ హాట్ టాపిక్‌గా మారింది. ఇంటెర్నెట్లో తెగవెతుకుతున్న నెటిజనులు దాని వివరాలు తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.
ప్రియాంక చోప్రా వైట్ అండ్ బ్లాక్ టాప్ వేసుకొని మెడలో డైమండ్ నెక్లెస్‌తో అందరిని ఆకట్టుకుంది. ఈ ఈవెంట్లో ప్రియాంక ధరించిన 140 క్యారెట్ల వజ్రాలతో కూడిన ఈ అందమైన నక్లెస్ ధర రూ. 320 కోట్లు ఉంటుంది. దీన్ని తయారు చేయడానికి దాదాపు 2,800 గంటల సమయం పట్టిందని తెలుస్తుంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజనులు ఆశ్చర్యపోయారు. ప్రతీ సంవత్సరం బల్గారీ ఏటర్నా జ్యువెలరీ కలెక్షన్ ప్రదర్శనకు ఉంచుతుంది. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ప్రియాంక చోప్రా పలు హాలీవుడ్ మూవీస్‌లో నటిస్తుంది. సిటాడెల్ వెబ్ సిరీస్ పెద్ద హిట్ అయిన విషయం తెలసిందే. ఇక 2018లో అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక అక్కడే సెటిల్ అయింది.