GNTR: దుగ్గిరాల మండలంలోని పలు సొసైటీలోని అమ్మవారి ఆలయాల్లో దసరా ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజున రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. దుగ్గిరాల మండలం కే.ఆర్.కొండూరు గ్రామంలో శ్రీ మహంకాళీ అమ్మవారు ఇవాళ ఆఖరి గురువారం అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అర్చకులు ఆలయ ఆవరణల్లోని జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.