ADB: విజయదశమి దసరా వేడుకల్లో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గురువారం పాల్గొన్నారు. నేరడిగొండ మండలంలోని ఆయన నివాసంలో నిర్వహించిన విజయదశమి వేడుకల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను నిర్వహించుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులున్నారు.