MBNR: దసరా పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామంలో ప్రత్యేక పూజలు చేసి స్థానికులతో ముచ్చటించారు. అనంతరం తన నియోజకవర్గంలోని కొడంగల్‌కు రోడ్డు మార్గం గుండా బయలుదేరారు. మార్గ మధ్యలో మిడ్జిల్‌లో కాసేపు ఆగుతారనే సమాచారం మేరకు స్థానిక యువత, నాయకులు, పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చి ఆయన కోసం ఎదురు చూస్తున్నారు.