NLG: నల్గొండ కేంద్ర గ్రంథాలయ లైబ్రేరియన్ కట్ట నాగయ్య గుండెపోటుతో మరణించారు. ఛాతిలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నాగయ్య మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రంథాలయ ఉద్యోగులు, మిత్రులు ఆయనకు నివాళులర్పించారు.