ASR: భారీ వర్షాలకు హుకుంపేట మండలంలోని మఠం కొత్తూరు గ్రామంలో పెసా కమిటీ ఉపాధ్యక్షుడు వంతాల ఈశ్వరరావుకు చెందిన ఇల్లు కూలిపోయింది. గురువారం రాత్రి సమయంలో ఇల్లు నేల కూలిందని బాధితులు ఇవాళ తెలిపారు. ఇంట్లో ఉన్న టీవీ, ఇతర సామగ్రి ధ్వంసం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.