GDWL: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు ఆకేపోగు రాంబాబు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన, పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించే దిశగా కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇచ్చిన హామీలను తీర్చాలన్నారు.