KRNL: నెల్లూరులోని ఓ గర్ల్స్ హాస్టల్లో నంద్యాలకు చెందిన మెడికో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. గురువారం కళాశాలకు వచ్చిన విద్యార్థిని, శుక్రవారం ఉదయం తోటి విద్యార్థులతో కలిసి టిఫిన్ చేసిన తర్వాత తన గదికి వెళ్లి ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.