WGL: తాటి చెట్టు పైనుంచి నేతన్న కింద పడిన ఘటన వర్ధన్నపేట మండలం దమన్నపేట గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. కులవృత్తిలో భాగంగా మందపురి శ్రీనివాస్ కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు మోపుతాడు జారడంతో చెట్టుపై నుంచి జారిపడ్డాడు. దీంతో శ్రీనివాస్‌కు తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన స్థానిక గీత కార్మికులు అతన్ని వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి తరలించారు.