GNTR: తెనాలిలో దసరా నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. 11 రోజుల పాటు అమ్మవారికి విశేష పూజలు నిర్వహించిన అనంతరం రాత్రి నిమజ్జనోత్సవం చేశారు. శుక్రవారం ఆలయాల వద్ద అన్న సంతర్పణలు జరిగాయి. సుల్తానాబాద్‌లోని కనకదుర్గమ్మ ఆలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు.