TG: రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. ఈ ఏడాది సెప్టెంబరులోనే రూ.3,046 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. సెప్టెంబరు 29న రూ.278 కోట్లు, 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86.23 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ 3 రోజుల్లోనే 60 నుంచి 80శాతం వరకు అమ్మకాలు పెరిగాయి.