కృష్ణా: గుడ్లవల్లేరు మండలం మామిడికోళ్ల గ్రామం పంచాయతీ కార్యాలయం వద్ద జీఎస్టీ అంశాలు, తగ్గింపు ధరల గురించి గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ తోట రాధిక గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. గ్రామస్థులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన GST 2.0 ద్వారా పొందగలిగే లాభాలు, నిత్యావసర వస్తువులపై తగ్గింపులు, సాధారణ ప్రజలకు అందే సౌకర్యాలు గురించి వివరించారు.