KNRL: ఆదోని మండలంలోని పెద్ద పెండేకల్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం గ్యాస్ లీకై ప్రమాదం జరిగింది. ఇంట్లో ఉన్న ఈరమ్మ మనవడు శ్రీకాంత్ ఒక్కసారిగా గ్యాస్ లీకై పేలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అతని తల్లిదండ్రులు పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్‌ను చికిత్స నిమిత్తం వెంటనే ఆదోని జనరల్ హాస్పిటల్‌కు తరలించారు.