NLG: చిట్యాల మండలం అరెగూడెంలోని దుర్గా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం కనకదుర్గ అమ్మవారి లడ్డూ వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన ఆరూరి రమేష్-లక్ష్మి దంపతులు రెండు లక్షల 516 రూపాయలకు వేలం పాటలో దుర్గామాత లడ్డును దక్కించుకున్నారు. వారిని ఉత్సవ కమిటీ సభ్యులు వల్లందాస్ సంతోష్, జోగు రాజు, నంద్యాల వినయ్, జుంజు వెంకటేష్ అభినందించారు.