CTR: పలమనేరు మున్సిపాలిటీలోని గడ్డూరులో సెప్టెంబర్ 26న జరిగిన దొంగతనం కేసును ఏడురోజుల్లో పలమనేరు పోలీసులు చేధించినట్లు DSP డేగల ప్రభాకర్ తెలిపారు. ఈ కేసులో పలమనేరుకు చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి, వారివద్ద నుంచి 68 గ్రాముల బంగారు నగలు, రూ.90వేల నగదు రికవరీ చేసినట్లు ఆయన తెలిపారు. కేసును ఛేదించిన పోలీసులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.