W.G: నరసాపురం పట్టణంలోని 3వ వార్డు జెట్టివారివీధిలో ఓ ఇంట్లో పేకాట స్థావరంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురుని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.14,090 నగదు, ఒక టేబుల్, ఎనిమిది కుర్చీలను స్వాదీనం చేసుకున్నారు. పేకాట ఆడేందుకు అద్దెకు ఇచ్చిన ఇంటి యాజమానిపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ బి.యాదగిరి తెలిపారు.