NLG: చిట్యాలలోని ముత్యాలమ్మగూడెం ప్రాంతానికి చెందిన ఉయ్యాల శంకరయ్య (79) శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై మామిడి రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం… భార్య చనిపోవడంతో గత 5 నెలలుగా ఒంటరితనంతో ఉంటూ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు. శుక్రవారం ఉదయం తన ఇంట్లోని వంట గదిలో ఐరన్ రాడ్‌కు చీరతో ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ ఘటనపై కూతురి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.