గౌహతి వేదికగా సౌతాఫ్రికా మహిళలతో జరిగిన మ్యాచ్లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 14.1 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్లు టామీ బ్యూమాంట్ (21), అమీ జోన్స్ (40) అజేయంగా నిలిచి మ్యాచ్ను గెలిపించారు.