CTR: కుప్పం పట్టణంలోని పలు దుకాణాల్లో శుక్రవారం సాయంత్రం మున్సిపల్ సిబ్బంది ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న దుకాణదారులకు జరిమానా విధించారు. ప్లాస్టిక్ నియంత్రణకు వ్యాపారులు సహకరించాలని లేనిపక్షంలో చర్యలు తప్పవని మున్సిపల్ సిబ్బంది హెచ్చరించారు. స్వర్ణ కుప్పం నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలంటూ కమిషనర్ పిలుపునిచ్చారు.