ASF: కాగజ్ నగర్ సబ్ డివిజన్ త్రిశూల్ పహాడ్ ఏరియాలో రావణ దహనం చేసే సమయంలో అమ్మాయిలను ఆటపట్టించిన ఆరుగురు ఆకతాయిలను పట్టుకున్నట్లు షీ టీం ఇన్ఛార్జ్ ASI సునీత శుక్రవారం తెలిపారు. వారి పెద్దల సమక్షంలో షీ టీమ్ బృందం కౌన్సిలింగ్ నిర్వహించారు. మహిళలు ఇబ్బందులకు గురైతే షీ టీమ్ నెంబర్ 8712670565 కి సమాచారం అందించాలని తెలిపారు.