కృష్ణా: మచిలీపట్నం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హల్లో ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో కలెక్టర్ బాలాజీ సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు, రవాణా, గిడ్డంగుల ఏర్పాట్లు, రైతులకు చెల్లింపులు తదితర అంశాలను విపులంగా సమీక్షించారు. అధికారులు సమన్వయంతో వ్యవహరించి, రైతులకు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.