NLR: క్రియేటివ్ హార్ట్స్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన స్కూల్ లెవెల్ పోస్టల్ చిత్రకళా పోటీలో చేజర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచారు. డ్రాయింగ్ మాస్టర్ తోట కిషోర్ కుమార్ శిక్షణలో 9వ తరగతి విద్యార్థిని Dv. కామాక్షి ఇషాని రెండవ స్థానం, 7వ తరగతి విద్యార్థిని Md. షహనాజ్ ఫాతిమా మూడవ స్థానం సాధించారు.