GNTR: గుంటూరు రైల్వేస్టేషన్లో రైల్వే పోలీసులు జరిపిన తనిఖీల్లో ముగ్గురు దొంగలు పట్టుబడ్డారు. GRP DIG, SP, DSPల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ తూర్పు వైపు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఈ ముగ్గురిని నిన్న అరెస్ట్ చేసి, శనివారం కోర్టులో హాజరుపరిచారు. వారి వద్ద నుంచి 3 సెల్ ఫోన్లు, రూ. 1.80 లక్షల మంగళసూత్రం చైన్ రికవరీ చేశారు.