GNTR: కూటమి నేతల మధ్య ఉన్న అధిపత్య పోరు కారణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్ పదవిని భర్తీ చేయలేదని తెనాలిలో మా-ఏపీ వ్యవస్థాపకుడు దిలీప్ రాజా ఆరోపించారు. పదేళ్లుగా ఒక్క సినిమాకు కూడా సబ్సిడీ ఇవ్వకపోవడం దురదృష్టకరం అన్నారు. ఇప్పటికైనా మేల్కొని సమర్థవంతమైన వ్యక్తికి వెంటనే ఛైర్మన్ పదవిని అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.