JN: జిల్లా కేంద్రంలో ఇవాళ పోలీసులు నకిలీ పోలీసును అరెస్టు చేశారు. గతంలో పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా పనిచేసిన కిరణ్ అనే వ్యక్తి కానిస్టేబుల్ కుమారస్వామి ఐడీ కార్డును దొంగిలించుకుని తాను పోలీసునని చెప్పుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడ్డాడు. శనివారం బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు కిరణ్ పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.