ADB: ప్రభుత్వ బియ్యాన్ని అమ్మిన, అక్రమంగా కొనుగోలు చేసిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్ శనివారం తెలిపారు. పట్టణానికి చెందిన షేక్ ఫైసన్, అబ్దుల్ సత్తార్ అనే ఇద్దరు నిందితులు అక్రమంగా బియ్యం అమ్ముతూ పట్టుబడినట్లు వెల్లడించారు. వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.