బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తొలిసారి భారత్ పర్యటనకు రానున్నారు. PM మోదీ ఆహ్వానాన్ని ఆంగీకరించిన ఆయన ఈ నెల 8, 9 తేదీల్లో భారత్లో పర్యటిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా మోదీ, స్టార్మర్ మధ్య 9న ముంబైలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. స్టార్మర్ పర్యటన, మోదీతో సమావేశం ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయనుంది.