TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పంచాయితీ సుప్రీంకోర్టుకు చేరింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9కి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో వంగా గోపాల్‌రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జీవో 9ని రద్దు చేయాలని పిటిషన్లో పేరొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు.. విచారణను రేపటికి వాయిదా వేసింది.