AP: జనసేన శాసనసభాపక్ష సమావేశం ముగిసింది. పార్టీ బలోపేతంపై 3 గంటలపాటు చర్చించారు. కూటమి బలోపేతంతోపాటు ఐక్యంగా ఉండాలని పార్టీ అధినేత పవన్ సూచించారు. విమర్శలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని, త్వరలో జిల్లాల పర్యటనలకు వస్తానని పేర్కొన్నారు. నిత్యం జనాల్లో ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవాలని, నియోజకవర్గాల్లో పెండింగ్ హామీలు, సమస్యలు తన దృష్టికి తేవాలన్నారు.