ఏలూరు: జిల్లాలో 10,655 మందికి ఆటో డ్రైవర్ సేవ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని కలెక్టర్ వెట్రి సెల్వి శనివారం తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రూ.15 వేలు చొప్పున రూ.15.98 కోట్లను ఆర్థిక సాయంగా ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లాలో అర్హులు ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేయాలని సూచించారు. అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్‌కు ఈ పథకం వర్తిస్తుందన్నారు.