మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలో జరిగే 80s రీయూనియన్ కోసం వారిద్దరూ కలిసి విమానంలో ప్రయాణించారు. ఈ సందర్భంగా చిరు, వెంకీ కలిసి ఫొటోకి ఫోజ్ ఇచ్చారు. ఇక చిరంజీవి నటిస్తోన్న ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీలో వెంకీ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.