ELR: పెదపాడు మండలం కలపర్రు టోల్గేటు వద్ద గుర్తు తెలియని వాహనం పాసింజర్ ఆటోను ఢీకొట్టిన ఘటన శనివారం జరిగింది. రాజమండ్రి- విజయవాడ దుర్గమ్మ గుడికి ఆటోలో ఓ ఫ్యామిలీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఏడుగురికి స్వల్ప గాయాలు కాగా.. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వైద్యం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.